రాజ్యసభ సభ్యుడిగా నియామకమైన నిరంజన్ రెడ్డి గారికి అభినందనలు- తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్.

 


ఆంధ్రప్రదేశ్ సచివాలయం: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడిగా నియామకమైన నిరంజన్ రెడ్డి గారికి అభినందనలు తెలిపిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఆలోచించే తత్వం గల నిరంజన్ రెడ్డి గారిని రాజ్యసభ సభ్యుడిగా నియమించడం అభినందించదగ్గ విషయమని  తెలియజేస్తూ ప్రజల పక్షాన పోరాడే  నవ యువ   నాయకులు రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి గారి  సేవలను సద్వినియోగం చేసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందుండాలని తెలియజేశారు. ఈ సందర్బంలో రాజ్యసభ సభ్యుడిగా నియామకమైన నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పార్లమెంట్   చట్టసభల్లో  రాజ్యసభ సభ్యుడిగా ప్రజల యొక్క సమస్యల గురించి  చర్చించడానికి ఎప్పుడూ ముందుంటానని తెలియజేశారు .