ఏపీ లో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..

  


పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ శుభవార్త తెలిపింది. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ పరీక్షను రాసే అవకాశం కల్పించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించారు. 50 కంటే తక్కువ మార్కులు వచ్చిన ఏవైనా రెండు సబ్జెక్టులకు బెటర్‌మెంట్ పరీక్ష రాసుకునే వీలు కల్పించారు. ఫెయిల్‌ విద్యార్థుల కోసం నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలతో ఈ బెటర్‌ మెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు.


ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒక్కో పరీక్షకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ బెటర్‌ మెంట్‌ పరీక్షలు కేవలం ఈ ఏడాదికి మాత్రమే పరిమతం అని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో సప్లమెంటరీ పరీక్షలను 06-07-2022 నుంచి 15-07-2022 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.