రజనీకాంత్ హీరోగా నటించిన 'చంద్రముఖి' చిత్రం సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలై దాదాపు రెండున్నరేళ్లు థియేటర్లతో సందడి చేసింది.
సినిమా వచ్చి 17 ఏళ్లు అయినా ఇప్పటికీ ఆ చిత్రం గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటుంటారు. ఈ సక్సెస్ఫుల్ సినిమాకు సీక్వెల్గా 'చంద్రముఖి-2')రానుందని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం సీక్వెల్ గురించి ఓ వార్తలు చక్కర్లు కొడుతోంది. తాజాగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ ట్విట్టర్లో ఓ పోస్టర్ విడుదల చేసి 'బిగ్ అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూడండి' అని రాసుకొచ్చారు. ఆ పోస్టర్ మీద ఒక తాళం చెవి బొమ్మ ఉండడంతో.. ఆ ప్రకటన 'చంద్రముఖి -2' గురించే అని నెటిజన్లు అభ్రిపాయపడుతున్నారు. అయితే ఆ పోస్టర్ వెనకున్న కథేంటో తెలుసుకోవాలంటే ఈ రోజు ఆరు గంటల వరకూ వేచి చూడాల్సిందే!