యశ్ కు జోడిగా బుట్ట బొమ్మ...?

 


సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో పూజా హెగ్డే  క్రేజ్ అండ్ రేంజ్ రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతుంది. వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. ఇటీవలే పూరి జగన్నాథ్  దర్శకత్వంలో విజయ్ దేవరకొండ  హీరోగా రూపొందుతున్న 'జనగణమన' సినిమాలో నటించడానికి సైన్ చేసిన పూజా..షూటింగ్‌లోనూ పాల్గొంటోంది. అంతేకాదు, హిందీలో కూడా సల్మాన్ ఖాన్ సరసన 'కభీ ఈద్ కభీ దీవాళీ'అనే సినిమా షూటింగ్‌లోనూ జాయిన్ కాబోతోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ నటిస్తున్నారు.


అయితే, ఇదే క్రమంలో ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ కేజీఎఫ్  సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్  సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నర్తన్ అనే దర్శకుడితో యష్ నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ముప్తీ' సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో మళ్ళీ ఈ కాంబో రిపీటవుతుంది. ఈ చిత్రాన్ని యశ్ లేదా కన్నడలో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని పంపీణి చేసిన కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుందని సమాచారం.


అయితే, ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెని కలిసి స్ర్కిప్ట్ వినిపించినట్టు టాక్.