డీజీపీకి చంద్రబాబు నాయుడు లేఖ .

 


గుంటూరు జిల్లాలో తెలుగుదేశంపార్టీ కార్యకర్త హత్యపై చంద్రబాబు నాయుడు డీజీపీకి ఓ లేఖ రాశారు. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.కుటుంబ సభ్యుల అనుమతిలేకుండా మృతదేహాన్ని తరలించడం, కుటుంబ సభ్యుల్ని బలవంతంగా బస్సుల్లో తీసుకెళ్లడమేంటని చంద్రబాబు లేఖలో ప్రశ్నించారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించి ఉంటే దారుణ హత్యలు జరిగేవికావనే అభిప్రాయం చంద్రబాబు వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీ నాయకులు పోలీసుల అండ దండలతో రెచ్చిపోతున్నారని, టీడీపీ కార్యకర్తలను భయ‎భ్రాంతులకు గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మాచర్లలో బిసి వర్గంపై జరుగుతున్న హత్యాకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. హంతకులకు మరణ శిక్ష విధించేలా పోలీసు శాఖ చర్యలు ఉండాలని కోరారు.