ఏపీ విద్యా వ్యవస్థలో భార్పీ మార్పులకు వైసీపీ ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. ప్రపంచంతో పోటీపడే విధంగా, విద్యార్థులకు అధునాతన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకుంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్.సురేష్‌కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్‌పాలసీ హెడ్ సుస్మిత్ సర్కార్ గురువారం సంతకాలు చేశారు. వర్చువల్ పద్ధతిలో ‘బైజూస్’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్ ఈ కార్యక్రమంలో అమెరికా నుంచి పాల్గొన్నారు.