చరణ్, గౌతమ్ సినిమాకి సౌత్ టాప్ మ్యూజిక్ డైరక్టర్...?

 


ప్రస్తుతం సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరక్టర్ గా కొనసాగుతున్నాడు అనిరుధ్. దేవిశ్రీ, తమన్ లాంటోళ్లకు క్రేజ్ ఉన్నప్పటికీ, వాళ్లు టాలీవుడ్ కే పరిమితం. అనిరుధ్ మాత్రం టోటల్ సౌత్ లోనే పాపులర్.
 

ఇప్పుడీ సంగీత దర్శకుడు తెలుగులో పెద్ద సినిమాలకు సంతకం చేసే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఇతడి ఖాతాలోనే ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఆఫర్ కూడా అనిరుధ్ నే వరించింది. శంకర్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, రామ్ చరణ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చిత్రానికి సంబంధించిన పనిని ప్రారంభించనున్నాడు. ‘జెర్సీ'(తెలుగు) విజయంతో మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్.. రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. 

‘జెర్సీ’కి అనిరుధ్ అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో, గౌతమ్ మళ్లీ అతనితోనే వర్క్ చేయాలనుకుంటున్నాడు. సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించే అవకాశం ఉంది.


తన ప్రతి సినిమాకు సెన్సిబుల్ సబ్జెక్టులు ఎంచుకునే గౌతమ్, ఈసారి చరణ్ కోసం యాక్షన్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాడు. ఇలాటి యాక్షన్ సబ్జెక్ట్ కు అనిరుధ్ లాంటి టెక్నీషియన్ యాడ్ అయితే అవుట్ పుట్ అదిరిపోతుంది. అందుకే అనిరుధ్ ను సంప్రదించాడు గౌతమ్. చరణ్ కూడా ఈ సెలక్షన్ కు నో చెప్పకపోవచ్చు. ఎందుకంటే, చెర్రీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నాడు