ప్రజల మీద సీఎం కేసీఆర్ మానసిక భౌతిక దాడులు --: రేవంత్ రెడ్డి..

  


టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు చితికిపోయాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.ప్రజల మీద సీఎం కేసీఆర్ మానసిక భౌతిక దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపిచ్చారు. వ్యవసాయం సంక్షోభంతో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ ఆస్తులు పెంచుకోడానికి, పార్టీని విస్తరించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రికి ధ్యాస లేదన్నారు. వేలాది మంది రైతులు ప్రభుత్వ సహకారం లేక పెట్టుబడులు నష్టపోయి, పంట చేతికి రాక, చేతికివచ్చిన పంట కొనుగోలు చేసేవాళ్లు లేక.. పిట్టల్లా రాలిపోతున్నా.. ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన సహకారం అందడంలేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.