ప్రభాస్, మారుతి సినిమా పై క్లారిటీ..

 


ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్ లో రాజా డీలక్స్ అనే సినిమా వస్తుందని, హరర్ కామెడీ గా ఈ చిత్రం తెరకెక్కనుందని కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

అయితే దీనిపై దర్శకుడు మారుతీ క్లారిటీ ఇచ్చారు. గోపిచంద్, రాశిఖన్నాలతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్ జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రభాస్ తో సినిమా గురించి చర్చలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. అది ఓకే అయితే వివరాలన్నీ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ సినిమా టైటిల్ రాజా డీలక్స్ అని, నేపథ్యం, హీరో హీరోయిన్స్ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టతనిచ్చారు. తాను ప్రభాస్ అభిమానినని, తనతో బుజ్జిగాడు, డార్లింగ్ లాంటి వినోదాత్మక సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నానని వివరించారు.