రైతులకు వారి స్థానిక భాషలో SMS ద్వారా వాతావరణ సూచనలు..



 రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, భారత వాతావరణ శాఖ  ప్రస్తుతం రైతులకు మరింత సహాయం చేసేందుకు సిద్ధమైంది. రైతులకు వారి స్థానిక భాషలో SMS ద్వారా వాతావరణ సూచనను అందించే పథకంపై IMD పని చేస్తోంది. ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఈ సేవ కోసం హెల్ప్ లైన్ నంబర్ జారీ చేయనున్నారు. దేశంలోని ఏ ప్రాంతమైన రైతు తన గ్రామం లేదా బ్లాక్ కోసం రాబోయే ఐదు రోజులలో వర్షం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం వంటి వాతావరణ సమాచారాన్ని పొందవచ్చు. IMD ప్రత్యేక బృందం ఈ అప్లికేషన్‌పై పని చేస్తుంది. SMS ద్వారా ప్రాంతీయ భాషలో సమాచారాన్ని అందించనుంది.


ప్రాంతీయ స్థాయిలో వాతావరణ సంబంధిత సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రైతులు ఎరువులు, ఇతర ఇన్‌పుట్‌ల వినియోగం, నీటిపారుదల వంటి వ్యవసాయ కార్యకలాపాలపై తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సాధారణ పౌరులు కూడా కామన్ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి తమ ప్రాంతంలో వాతావరణ సూచనను తెలుసుకోవచ్చు.